ఈశాన్యంలో బీజేపీ పాగా
అత్యధిక సీట్లలో విజయం ఖాయం మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్
డిస్ఫూర్: ఈశాన్య ప్రాంతాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని బీజేపీ నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్ చాట్ ద్వారా మాట్లాడారు. ఈశాన్యంలో ఉన్న మొత్తం 25 స్థానాల్లో 20కి పైగా స్థానాలను కైవసం చేసుకోవడం పక్కా అన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో మోదీ మేనియా బాగా పెరిగిందన్నారు. అంతేగాక ఆయన అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనీయడం వల్ల ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చించామన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీ విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఆయన సారథ్యంలో తప్పక విజయ లక్ష్యాన్ని అలవోకగా చేరుకుంటామని అలోంగ్ తెలిపారు.