మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియాకు మోదీ అభినందన
Modi congratulates Mexico's first woman president, Claudia
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన క్లాడియా షీన్ బామ్ ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మెక్సికోకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికవడం ప్రజలకు గొప్ప సందర్భమన్నారు. భారత్–మెక్సికోల మధ్య సహకారం మరింత పెరుగుతుందని ఆశించారు. క్లాడియా షీన్ బామ్ శాస్ర్తవేత్త, మెక్సికో నగరానికి మాజీ మేయర్.