ప్రభాస్,సంజయ్ దత్ తాతా మనవళ్ళా?!
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్యూర్ లవ్ స్టోరీతో చేసిన రాధేశ్యామ్ రిజల్ట్ ఏంటనేది అందరికి తెలిసిందే.
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్యూర్ లవ్ స్టోరీతో చేసిన రాధేశ్యామ్ రిజల్ట్ ఏంటనేది అందరికి తెలిసిందే. అందుకే భారీ బడ్జెట్ లు పెట్టి అనవసరమైన రిస్క్ లు తీసుకోవాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఆరు సినిమాల వరకు ఉన్నాయి. వాటిలో మారుతి దర్శకత్వంలో చేస్తోన్న రాజాసాబ్ ఒకటి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది భిన్నంగా ఉండబోతోంది.
హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కంప్లీట్ ఒక ప్యాలస్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథ మొత్తం నడవబోతుందంట. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
సత్యరాజ్ ప్రభాస్ తండ్రి క్యారెక్టర్ లో కనిపించబోతూ ఉండగా సంజయ్ దత్ తాతగా మూవీలో నటిస్తున్నాడంట. అతను ఆత్మగా ఈ మూవీలో కనిపిస్తారని లేటెస్ట్ గా మరో లీక్ వైరల్ అవుతోంది. తాత, మనవాళ్ళుగా సంజయ్ దత్, ప్రభాస్ పండించే ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఆసక్తికరంగా సాగుతుందని టాక్. అలాగే ప్రభాస్ జీవితంలో ఊహించని మార్పులకి సంజయ్ దత్ కారణం అవుతాడంట. ప్రస్తుతం టాలీవుడ్ లో అతని క్యారెక్టర్ గురించి ఈ తరహాలో ఆసక్తికర ప్రచారం నడుస్తోంది.
ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఆశించే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయంట. అలాగే డాన్స్ మూమెంట్స్ కూడా ప్రభాస్ ఈ సినిమాలో చేయనున్నాడని తెలుస్తోంది. ఓవరాల్ గా మారుతి తన స్టైల్ లోనే అవుట్ అండ్ అవుట్ హీలేరియస్ ఎంటర్టైన్మెంట్ ని పాన్ ఇండియా రేంజ్ లో భారీ కాన్వాస్ పై ఆవిష్కరించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి రాజా సాబ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.