డేంజర్ జోన్ లో ఢిల్లీ
Delhi is in the danger zone
400 దాటిన ఏక్యూఐ
హరియాణాలో పంట కాలిస్తే రూ. 30వేల జరిమానా
ప్రజారవాణాను ఆశ్రయించాలని విజ్ఞప్తి
రక్షణ చర్యలు తీసుకునే బయటికి వెళ్లాలి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి వాయుకాలుష్యం పరిస్థితి మరింత దిగజారింది. బుధవారం నాటి ఏక్యూఐని గురువారం వాతావరణ శాఖ విడుదల చేసింది. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400దాటింది. దీంతో వాయుకాలుష్యంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనికి తోడు ఢిల్లీ ఎన్సీఆర్ లో చలి పెరుగుతోంది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర కేటగిరిలో ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా వాయుకాలుష్యం ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు హరియాణాలో పంటలను కాలిస్తే రూ. 30వేల జరిమానా విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
కాలుష్యం నమోదైన ప్రాంతాలు..
అలీపూర్‌లో 386, ఆనంద్ విహార్‌లో 426, అశోక్ విహార్‌లో 417, అయానగర్‌లో 349, బవానాలో 411, బురారీలో 377, చాందినీ చౌక్‌లో 301, సిఆర్‌ఆర్‌ఐ మధుర రోడ్డులో 340, డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో 370, డిటి 378 రేంజ్, ద్వారకా సెక్టార్ 8లో 380 ఏక్యూఐ నమోదైంది. రానున్న రోజుల్లో మరింత కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
వాయుకాలుష్యం నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రజలు ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలన్నారు. బయటికి వెళ్లేటప్పుడు మాస్క్ వాడాలని, కాలుష్య స్థాయిని బట్టి బయటికి వెళ్లాలని సూచించారు. ఇంట్లో గాలిని శుభ్రం చేయడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ ని ఉపయోగించాలని సూచించారు. విటమిన్లు పుష్కలంగా లభించే కూరగాయలను తినాలని వైద్యులు సూచించారు.