సినిమాలు లేకున్నా టచ్ లోనే ఉంది

చెన్నై బ్యూటీ రెజీనా షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో తెలిస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అమ్మ‌డు సినిమాలు చేస్తోంది.

Apr 24, 2024 - 15:39
 0
సినిమాలు లేకున్నా టచ్ లోనే ఉంది

చెన్నై బ్యూటీ రెజీనా షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో తెలిస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అమ్మ‌డు సినిమాలు చేస్తోంది. గ‌తేడాది మూడు రిలీజ్ ల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అంత‌కు ముందు ఏడాది నాలుగు రిలీజ్ ల‌తో థియేట‌ర్లో క‌నిపించింది. మ‌రి ఇందులో విజ‌యాలు ఎన్ని అంటే బూత‌ద్దం పెట్టి వెతికినా ఒక్క విజ‌యం కూడా క‌నిపించ‌డ‌దు. మ‌రి 2024 లో ప‌రిస్థితి ఏంటి? అంటే ఆ రెండు సంవత్స‌రాలను మించి సినిమాలు చేస్తోంది.  ప్ర‌స్తుతం ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయి. త‌మిళ్..హిందీలో కలిపి అన్ని సినిమాల‌కు క‌మిట్ అయింది. అయితే వీటిలో 'ఉత్సవం' అనే తెలుగు సినిమా ఒక‌టి ఉంది. కానీ ఇది డిలే అవుతోన్న ప్రాజెక్ట్. దాంతో సంబంధం లేకుండా రెజీనా మిగ‌తా సినిమాల‌తో బిజీగా ఉంది. దాదాపు 17 ఏళ్ల‌గా ఇండ‌స్ట్రీలో ఇలా జ‌ర్నీ కొన‌సాగించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. స‌క్సెస్ లుంటే త‌ప్ప అవ‌కాశాలు రాని రోజుల్లో రెజీనా మాత్రం అందుకు భిన్నంగా సినిమా అవ‌కాశాలు అందుకుంటుంది. ఆ విష‌యంలో అమ్మ‌డు ఎంతో ల‌క్కీ అనే అనాలి. ఎంతో కాంపిటీష‌న్ ఉన్నా దాంతో సంబంధం లేకుండా ఛాన్సులు అందుకుంటుంది. అదే హిట్లు ప‌డితే రెజీనా వేగాన్ని ఆప‌డం అసాధ్య‌మ‌నే చెప్పాలి. మ‌రోవైపు నిత్యం సోష‌ల్ మీడియా తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు హృద‌యాల్ని దోచేస్తుంది. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి చీరందంలో త‌ళుకులీనింది. బ్లూ క‌ల‌ర్ సారీలో అమ్మ‌డు బ్యూటీ మామూలుగా లేదు. మ్యాచింగ్ ర‌విక ధ‌రించి అలా బీచ్ లో వాక్ చుస్తుంటే! హృదయాలు ఏమైపోవాలి. Also Read - వాళ్ల‌ను చూసి రాజమౌళి అసూయ‌! అయితే రెజీనా చీర ధరించ‌డానికి ఇక్క‌డో ప్ర‌త్యేక‌త ఉంది. బీచ్ లో క్లీన్ అండ్ గ్రీన్ కార్య‌క్ర‌మంలో భాగంగా బీచ్ లో ఉన్న చెత్తా చెదారం చేతికి గ్లౌవ్స్ వేసుకుని క్లీన్ చేస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌భుత్వాలు బీచ్ క్లీన్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా సోష‌ల్ అవేర్ నెస్ లో భాగంగా సెల‌బ్రిటీలు సైతం నేరుగా రంగంలో కి దిగుతున్నారు. ఇప్పుడు వంతు రెజీనాది కావ‌డంతో ఇలా ప్ర‌త్యేకంగా చీర ధ‌రించి త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూనే బీచ్ ని క్లీన్ చేసింది.