గ్లామర్ మీద ఉన్న ‘శ్రద్ధ’ సినిమాలపై లేదు
శ్రద్ధా దాస్.. తెలుగు ఆడియన్స్ లో ఈమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.
శ్రద్ధా దాస్.. తెలుగు ఆడియన్స్ లో ఈమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. యాక్టింగ్ కంటే తనదైన గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ అమ్మడు. అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఈ చిత్రంతో కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోకపోయినా.. అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆర్య-2తో పాపులర్ అయింది ఈ బ్యూటీ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా తర్వాత శ్రద్ధకు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఈ సీనియర్ బ్యూటీ.. తెలుగు సినిమాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా మెరిసింది. లాహోర్, దిల్ తో బచ్చా హై, తీన్ పహేలియా వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల నిరీక్షణ మూవీతో అలరించిన శ్రద్ధ.. పారిజాత పర్వంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో ఆమె నటించిన తెలుగు సినిమా అర్థం విడుదల కానుంది. బెంగాలీ, కన్నడ, హిందీలో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. మరోవైపు వెబ్ సిరీసులతో కూడా దూసుకుపోతోంది శ్రద్ధా దాస్. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది. ఖాకీ బీహర్ ఛాప్టర్ వెబ్ సిరీస్ లో శ్రద్ధ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 40కు పైగా చిత్రాల్లో యాక్ట్ చేసి అలరించింది శ్రద్ధా దాస్. ఇక సోషల్ మీడియాలో అయితే.. శ్రద్ధ రూటే వేరు. గ్లామర్ గేట్లు ఎత్తేసి నెటిజన్లను అలరిస్తుంటోంది. కుర్రకారుకు మైకం తెప్పించే స్టిల్స్ ను పోస్ట్ చేస్తుంటోంది. కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ సెగలు పుట్టిస్తుంటోంది. తన అందాలతో పరేషాన్ చేస్తుంటోంది. నెట్టింట ఎప్పుడూ శ్రద్ధ పిక్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది శ్రద్ధా దాస్. రెడ్ బ్లౌజ్, లాంగ్ మిడ్డీలో దిగిన పిక్స్ షేర్ చేసింది. ట్రెండీ నెక్ సెట్ చాటున ఎద అందాలతో కవ్విస్తోంది శ్రద్ధ. కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో మరోసారి ట్రెండ్ అవుతోంది శ్రద్ధ. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని విధంగా అమ్మడి పోజులు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గ్లామర్ షోకు ఫిదా అయ్యామని అంటున్నారు. శ్రద్ధను చూసి మైమరిచిపోతున్నామని చెబుతున్నారు. మరి శ్రద్ధ తన కొత్త సినిమాలు, వెబ్ సిరీసులతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.