ఉగ్రవాద సహాయకులపై ‘ఎనిమీ ఏజెంట్​’ చట్టం అమలు

ఉరిశిక్ష కూడా విధించే అవకాశం డీజీపీ ఆర్​ ఆర్​ స్వైన్​

Jun 25, 2024 - 19:54
 0
ఉగ్రవాద సహాయకులపై ‘ఎనిమీ ఏజెంట్​’ చట్టం అమలు

శ్రీనగర్​: ఉగ్రవాదులకు సహాయం చేసే వారిపై కేంద్ర ప్రభుత్వం బలమైన చట్టాన్ని ప్రయోగించనుంది. ఈ చట్టం అమలుకు కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టిందని జమ్మూకశ్మీర్​ డీజీపీ ఆర్​ఆర్​ స్వైన్​ తెలిపారు. మంగళవారం  స్వైన్​ మీడియాతో మాట్లాడారు. ‘ఎనిమీ ఏజెంట్​’ (శత్రువు సహాయకులు) అన చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. త్వరలోన ఈ చట్టం అమలు కాబోతోందని స్పష్టం చేశారు. ఈ చట్టం ఉపా కంటే కఠినమైది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు దీన్ని మొదటగా అప్పటి డోగ్రా మహారాజు 1917లో ‘ఎనిమీ ఏజెంట్​​ ఆర్డినెన్స్’ ఏర్పాటు చేశారు. అనంతరం 1947 తరువాత ఈ చట్టాన్ని సవరించారు. ఇదే చట్టం ప్రకారం 1966లో మక్బుల్​ భట్​ అనే ఉగ్రవాదికి మరణశిక్ష విధించగా 1984లో ఉరిశిక్ష అమలైంది. ఈ చట్టం కింద 10 యేళ్ల నుంచి జీవిత ఖైదు శిక్ష, మరణశిక్షలు కూడా విధించే అవకాశం ఉంది.