క్రీడాకారులకు ప్రోత్సాహం
పవర్ లిఫ్టర్ సుకన్యకు ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డికి ధన్యవాదాలు
నా తెలంగాణ, డోర్నకల్: మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువతి క్రీడాకారిణిగా పేరు ప్రఖ్యాతులు సాధించడం అభినందించదగ్గ విషయమని మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి అన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. మహబూబా జిల్లా సిరోలు మండలం, రూప్ల తండా జగ్యా తండాకు చెందిన తేజావత్ సుకన్యకు మంత్రి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. సుకన్య అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో టాప్ 8 క్రీడాకారిణిగా నిలిచారు. పోటీల్లో పాల్గొనేందుకు సుకన్య అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ సందర్భంగా మంత్రి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ పోటీల్లో 60 దేశాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొననున్నారు. ఆర్థిక సహాయంపై సుకన్య మంత్రికి రుణపడి ఉంటానని తెలిపారు.