జమ్మూకశ్మీర్​, హరియాణాలో మోగిన ఎన్నికల నగారా

జమ్మూకశ్మీర్​ లో మూడు విడతల్లో ఎన్నికలు హరియాణాలో ఒకే విడతలో ఎన్నికలు అక్టోబర్​ 4న ఎన్నికల ఫలితాలు

Aug 16, 2024 - 15:58
Aug 16, 2024 - 17:02
 0
జమ్మూకశ్మీర్​, హరియాణాలో మోగిన ఎన్నికల నగారా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్​, హరియాణా ఎన్నికల నగారా మోగింది. జమ్మూకశ్మీర్​ లో మూడు విడతల్లో 90 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుండగా, హరియాణాలో ఒకే విడతలో 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్​ రాజీవ్​ కుమార్​ తెలిపారు. శుక్రవారం ఆయన ఎన్నికలకు సంబంధించి ఈసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హరియాణా, జమ్మూకశ్మీర్​ ఎన్నికల తేదీలను, వివరాలను ప్రకటించారు. 

జమ్మూకశ్మీర్​: 18 సెప్టెంబర్​ 24 స్థానాలు, 25 సెప్టెంబర్​ 26 స్థానాలు, 1 అక్టోబర్​ 40 స్థానాలలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 90 స్థానాలలో ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఆగస్ట్​ 20న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. 4 అక్టోబర్​ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 11,838  పోలింగ్​ బూత్​ లను ఏర్పాటు చేయనుండగా, 360 మోడల్​ పోలింగ్​ బూత్​ లను ఏర్పాటు చేయనున్నారు. జమ్మూకశ్మీర్​ లో 87.09 లక్షల మంది ఓటర్లుండగా, 20 లక్షల మందికిపైగా యువత ఉన్నారు. 
నోటిఫికేషన్​..
ఫేజ్​–1 ఫేజ్​–2 ఫేజ్​–3
సీట్లు                          24                   26                        40
నోటిఫికేషన్​              20 ఆగస్ట్​         29 ఆగస్ట్​           5 సెప్టెంబర్​
నామినేషన్​              27 ఆగస్ట్​         5 సెప్టెంబర్​      12 సెప్టెంబర్​
నా.పరిశీలన            28 ఆగస్ట్​         6 సెప్టెంబర్​      13 సెప్టెంబర్​
నా.ఉపసంహరణ   30 ఆగస్ట్​         9 సెప్టెంబర్​       17 సెప్టెంబర్​
ఒటింగ్​                    18 సెప్టెంబర్​  25 సెప్టెంబర్​     1 అక్టోబర్​
హరియాణా: హరియాణాలో మొత్తం 90 స్థానాలుండగా 1 అక్టోబర్​ న ఒకే విడతలో ఓటింగ్​ నిర్వహించనున్నారు. 4 అక్టోబర్​ న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2.1 కోట్లకు పైగా ఓటర్లున్నారు. 90 సీట్లకు గాను 73 సీట్లు జనరల్​ కు కేటాయించారు. ఆగస్ట్​ 27న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. 20,269 పోలింగ్​ బూత్​ లు ఏర్పాటు చేయనుండగా ఇందులో 150 మోడల్​ పోలింగ్​ బూత్​ లు ఉండనున్నాయి. 
నోటిఫికేషన్​..
90 స్థానాలకు గాను 5 సెప్టెంబర్​ న నోటిఫికేషన్​ వెలువడనుంది. 12 సెప్టెంబర్​ వరకు నామినేషన్ల స్వీకరణ, 13 సెప్టెంబర్​ న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ 16 సెప్టెంబర్​, అక్టోబర్​ 1న ఓటింగ్​ నిర్వహించనున్నారు. 
రెండు ప్రాంతాలకు సంబంధించి అక్టోబర్​ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
రాజీవ్​ కుమార్​..
మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్​ రాజీవ్​ కుమార్​ మాట్లాడుతూ.. అమర్​ నాథ్​ యాత్ర ముగింపు, వర్షాలు ఎక్కువగా ఉండడంతో ఎన్నికల నిర్వహణకు వేచి ఉన్నామని తెలిపారు. అడ్డంకుల తొలగింపుతో ఎన్నికల నిర్వహణను ప్రకటించామని తెలిపారు. మహారాష్ర్టలో పర్వదినాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజీవ్​ కుమార్​ తెలిపారు. జమ్మూకశ్మీర్​ లో ఎన్నికల కోసం అన్ని పార్టీల విజ్ఞప్తుల కూడా పరిశీలించామన్నారు. ప్రజలంతా తమ ప్రాంతంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని, ముఖ చిత్రాన్ని మార్చే రోజు కోసం ఎంతో ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఓటింగ్​ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. నీరు, విద్యుత్​, మరుగుదొడ్లు, దివ్యాంగ ఓటర్లకు వీల్​ చైర్​ ల సౌకర్యం కల్పిస్తామన్నారు. నిర్భయంగా అందరూ ఓటింగ్​ లో పాల్గొనాలని రాజీవ్​ కుమార్​ విజ్ఞప్తి చేశారు.