సమస్యల పరిష్కారంతో ఐదోస్థాయికి ఆర్థిక వ్యవస్థ

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​

Mar 28, 2024 - 19:24
 0
సమస్యల పరిష్కారంతో ఐదోస్థాయికి ఆర్థిక వ్యవస్థ

తిరువనంతపురం: అనేక సమస్యల పరిష్కారం తరువాత భారత ఆర్థిక వ్యవస్థ ఐదోస్థాయికి చేరిందని ఇదే అభివృద్ధిని మరింత వేగవంతం చేసే చర్యలను భారత్​ తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. తిరువనంతపురం బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్​ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్​ హాజరై ప్రసంగించారు. దేశాభివృద్ధిలో అన్ని రాష్ర్టాల భాగస్వామ్యం తప్పక ఉండాలని ఆకాంక్షించారు. గత మూడు త్రైమాసికాల్లో 8 శాతానికి పైగా వృద్ధిని సాధించామని నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు దాదాపు ఎనిమిది శాతం ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అయితే వృద్ధి రేటుపై నివేదికలందాక ఖచ్చితమైన వృద్ధిరేటును తెలియజేస్తామన్నారు. కొనుగోలు శక్తి మధ్యతరగతి ప్రజల్లో గణనీయంగా పెరగనున్నట్లు వివరించారు. 2030 నాటికి 70 మంది జనాభా కొనుగోలు శక్తిలో కీలకపాత్ర పోషిస్తారని మంత్రి పేర్కొన్నారు.