కేజ్రీ ఇంటి ఎదుటే కాల్పుల మోత కాలుష్యం కాదా?

Why does Kejriwal's house cause so much pollution?

Sep 15, 2024 - 13:23
 0
కేజ్రీ ఇంటి ఎదుటే కాల్పుల మోత కాలుష్యం కాదా?

చట్టాన్ని ఉల్లంఘిస్తారా?
ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి అక్కడే ఉన్నా నోరు మెదపరా?
హిందువుల పండుగలకే కాలుష్యం అడ్డు వస్తుందా? 
పోలీసులు, కోర్టులు చర్యలు తీసుకోవాలని వీహెచ్​ పీ విజ్ఞప్తి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఓ వైపు కాలుష్యం పేరుతో హిందు పర్వదినాలైన దసరా, దీపావళిలో టపాసులు పేల్చేందుకు నియమిత రూపంలో అనుమతి లభిస్తుంది. ఇక భారత రాజధానిలోనైతే టపాసుల కాల్చివేతపై నిషేధాన్నే విధిస్తారు. మరి అలాంటప్పుడు సీఎం కేజ్రీవాల్​ బెయిల్​ పై బయటికి వస్తే జైలు వద్ద, ఆయన ఇంటివద్ద టపాసులు ఎలా పేలుస్తారని వీహెచ్​ పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టపాసులు పేల్చేందుకు అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. టపాసుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధిస్తారు. మరీ సీఎంకు బెయిల్​ వచ్చిన తరువాత ఈ టపాసులు ఆప్​ పార్టీ ఎక్కడికెళ్లి తీసుకురాగలిగిందని నిలదీశారు. ఓ వైపు విజయం గెలిచిందని మాట్లాడుతున్న వీరు కాలుష్​యం ఎక్కువవుతుందని చెబుతున్నవీరి పార్టీ చర్యలు దేశ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాయని ప్రశ్నించారు. తాము ఆడితే నాత్యం, ఇతరులు ఆడితే పిచ్చి చేష్ఠలా? అని మండిపడ్డారు. 


చట్టాన్ని ఉల్లంఘించడం వీరికి కొత్తేం కాదన్నారు. సాక్షాత్తూ సీఎం నివాసం ఎదుటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా, రాష్ర్ట పర్యావరణ శాఖ మంత్రి గోపాల్​ రాయ్​ కూడా అక్కడే ఉన్నా అక్కడ చట్టం ఉల్లంఘించబడుతున్నా ఈ పార్టీ ఎలాంటిదో అర్థం అవుతుందన్నారు. వీరి మనుగడ కోసం చట్టాన్ని సైతం పక్కన పెడుతోందని అర్థం అవుతుందన్నారు. మరీ దీనిపై కనీసం ఢిల్లీ పోలీసులైనా చర్యలు తీసుకోవాలని వినోద్​ బన్సాల్​ విజ్ఞప్తి చేశారు. ఓ అవినీతిపరుడు జైలు నుంచి వస్తే అది ఆనంద క్షణం ఎన్నటికీ కాబోదన్నది గుర్తెరగాలని వినోద బన్సాల్​ చురకలంటించారు.  


ఈ విషయాన్ని కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేసి ఆప్​ పార్టీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వినోద్​ విజ్ఞప్తి చేశారు.