ప్రధాని పదవి ఆశ చూపారు
విలువలతో కూడిన రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
నాగ్ పూర్: తనకు ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పూర్తి మద్ధతిస్తామని ఒక ప్రతిపక్ష నాయకుడు తనను సంప్రదించారని కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ అన్నారు. నాగ్ పూర్ లో జర్నలిస్ట్ అనిల్ కుమార్ 2023 పురస్కారాల ప్రదానోత్సవంలో గడ్కరీ మాట్లాడారు. తాను రాజకీయ అధికారం కంటే సిద్ధాంతం, సూత్రాలకే ప్రాధాన్యతనిస్తానని వారికి తేల్చి చెప్పానని చెప్పారు. ప్రధానమంత్రి కావాలనేది తన జీవిత ఆశయం కాదని, తాను నమ్ముకున్న బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేయలేనని తేగేసి చెప్పినట్లు గడ్కరీ తెలిపారు. తన విధేయత, చిత్తశుద్ధిని దెబ్బతీసేందుకు తనకు ప్రధానమంత్రి పదవి ఆశ చూపారన్నారు. కానీ విలువలతో కూడిన రాజకీయాలకు మాత్రమే తాను కట్టుబడి ఉండడం వల్ల తనతో వారు రాజీ కుదుర్చుకోలేకపోయారని గడ్కరీ తెలిపారు. భారతీయ ప్రజాస్వామ్యం విలువలతో కూడుకున్నదని తెలిపారు. తాను ప్రజాస్వామ్యానికి విలువనిచ్చేవాడినని వారికి స్పష్టంగా చెప్పానని నితిన్ గడ్కరీ పునరుద్ఘాటించారు.