కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం
మోదీ నేతృత్వంలో మహిళా శ్రామిక శక్తికి అవకాశం
గణనీయమైన పురోగతి సాధ్యపడిందన్న మంత్రి
గతేడాదితో పోలిస్తే 6.10 శాతం వృద్ధి
ఎగుమతుల్లోనూ వృద్ధి నమోదు
నా తెలంగాణ, న్యూఢిల్లీ: నల్ల బంగారం ఉత్పత్తిలో 2024 అక్టోబర్ లో భారీ వృద్ధిని సాధించామని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. బొగ్గుమంత్రిత్వ శాఖ జారీ చేసిన నివేదిక సారాంశాన్ని మంత్రి శనివారం మీడియాకు వెల్లడించారు. ఉత్పత్తిని పెంచడం, లాజిస్టిక్స్‌ను క్రమబద్ధీకరించడం, దేశం ఇంధన లక్ష్యాలకు మద్దతు ఇవ్వడంపై నిరంతర దృష్టితో, భారతదేశ ఇంధన డిమాండ్‌లను తీర్చడానికి ప్రధాని మోదీ నేతృత్వంలో దూరదృష్టితో పనిచేస్తున్నాని దీంతో సత్ఫలితాలను సాధిస్తున్నాని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మోదీ నేతృత్వంలో మహిళల సముపార్జన కోసం బొగ్గు గనుల కార్యకలాపాలలో శ్రామికశక్తిలో చేరామన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించగలిగామని కేంద్రమంరి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రంగంలో కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్పామన్నారు.
అక్టోబర్ లో 84.45 మిలియన్ టన్నులు చేరుకుందన్నారు. గతడాది ఇదే నెలలో 7.57 మెట్రిక్ టన్నులను అధిగమించి 7.48 శాతం వృద్ధిని సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇతర సంస్థల నుంచి కూడా బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని తెలిపారు. ఇది గతేడాది కాలంలో 11.70 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ప్రస్తుత 16.59 మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. 41.75 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. 2024 అక్టోబర్ వరకు బొగ్గు ఉత్పత్తి 537.45 మెట్రిక్ టన్నులకు చేరుకుందని మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.2023–24లో ఇదే కాలానికి ఉత్పత్తి 506.56 మె. టన్నులుగా నమోదైందని, ఇది 6.10 శాతం వృద్ధిని సూచిస్తుందని తెలిపారు. ఎగుమతులు 2023–24ఇదే కాలానికి 541.51 టన్నులు ఎగుమతి చేయగా, 2024 అక్టోబర్ వరకు 571.39 టన్నులు ఎగుమతి చేశామన్నారు.