కాంగ్రెస్​ హయాంలో ల్యాండ్​ ఆర్డర్​ ‘హస్త’ వ్యస్థం

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం రాజస్థాన్​ ఎన్నికల సభలో మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

Apr 7, 2024 - 17:41
 0
కాంగ్రెస్​ హయాంలో ల్యాండ్​ ఆర్డర్​ ‘హస్త’ వ్యస్థం

జైపూర్: కాంగ్రెస్ హయాంలో ల్యాండ్​ ఆర్డర్​ పూర్తిగా గతి తప్పిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. రాజస్థాన్​లోని ప్రస్తుత ప్రభుత్వం అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజస్థాన్​లోని బికనీర్​ అభ్యర్థి అర్జున్​రామ్​మేఘ్​వాల్​కు అనుకూలంగా కోలాయత్​లో జరిగిన బహిరంగ సభలో మంత్రి రాజ్​నాథ్​సింగ్​ మాట్లాడారు. సీఎం భజన్​లాల్​ శర్మ నేతృత్వంలోని పోలీసు శాఖ పటిష్టమైందని తెలిపారు. నిందితులు మార్కెట్​లో చిరుధాన్యాలు తెచ్చుకున్నట్లు ఆయుధాలను కొనుగోలు చేసి వాటి ద్వారా దేశంలో అసాంఘిక కార్యకలాపాలు, హత్యలకు పాల్పడేవారని పేర్కొన్నారు. అలాంటి చర్యలకు పూర్తిగా మోదీ ప్రభుత్వం ఫుల్​స్టాప్​పెట్టిందన్నారు. కాంగ్రెస్​ హయాంలో రూ. 600 కోట్ల ఎగుమతులు మాత్రమే ఉంటే, మోదీ హయాంలో పదేళ్లలో రూ. 31వేల కోట్ల ఎగుమతులు చేయగలిగామని తెలిపారు.

వైపు దేశ సైనికులు ఉగ్రవాదం, అసాంఘిక శక్తులపై పోరాడుతుంటే వారి పరాక్రమాలను కొనియాడాల్సింది పోయి కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు విమర్శలు చేయడం వారి చేతగాని తనానికి నిదర్శనమన్నారు. భారత్​ చేసిన దాడులకు రుజువులు కావాలని అడగడాన్ని గుర్తు చేశారు. మోదీ హయాంలో ఇకముందు ఒకే దేశం ఒకే ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నామని రాజ్​నాథ్​సింగ్​ స్పష్టం చేశారు. నేడు భారత్​ మాట్లాడితే ప్రపంచం వింటోందని అన్నారు. కాంగ్రెస్​ హయాంలో భారత్​ మాటను ప్రపంచదేశాలు పట్టించుకునేవి కూడా కాదన్నారు. అంతా ప్రధాని మోదీ ప్రపంచదేశాలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తున్నారని, అదే సమయంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం, స్నేహం, అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, శాంతితో మెలగుదామని ఉద్భోదిస్తున్నారని కొనియాడారు. అందువల్లనే నేడు అన్నిదేశాలతో భారత్​కు సత్సంబంధాలు నెలకొన్నాయన్నారు. రష్యా – ఉక్రెయిన్​ యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను వెనక్కు తీసుకురావడం, ఖతార్​లో ఉరిశిక్ష పడ్డ అధికారులు, శ్రీలంకలో ఉరిశిక్ష పడ్డ మత్స్యకారులను వెనక్కు తీసుకురాగలిగామని అన్నారు.

భారతీయులు ఎక్కడ ఉన్నా సురక్షితంగా, సంతోషంగా ఉండాలనేదే తమ అభిమతం అన్నారు. అదేసమయంలో ఉగ్రవాదం, అసాంఘిక వ్యక్తులతో అప్రమత్తత పాటించాలని రాజ్​నాథ్​సింగ్​ స్పష్టం చేశారు.