నిందితులకు ఉరిశిక్షే!
వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యపై సీఎం మమతా బెనర్జీ
కోల్ కతా: వైద్య విద్యార్థిని హత్య, అత్యాచారంలో నిందితులకు ఉరిశిక్ష తప్పదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. శనివారం వైద్యవిద్యార్థిని పోస్టుమార్టంలో అత్యాచారం, హత్యగా తేలడంలో సీఎం మమతా స్పందించారు.
ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ఈ దాడుల్లో జరుగుతున్న ఆందోళనల్లో ఆగ్రహం, డిమాండ్లు న్యాయమైనవే అన్నారు. తాను కూడా వారందరికీ మద్ధతు తెలుపుతున్నానని చెప్పారు. కుటుంబీకులో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అదే సమయంలో కేంద్రం విచారణ చేపడతామంటే తాము స్వాగతిస్తామన్నారు. కేసు దర్యాప్తునకు మమత ప్రభుత్వం ఏడుగురు సభ్యులో కూడిన సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.