ఇంధన పరివర్తనలో అణుశక్తి కీలక పాత్ర
నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇంధన పరివర్తనలో అణుశక్తి కీలక పాత్ర పోషిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ అన్నారు. కేంద్ర పంచామృత లక్ష్యాలను సాధించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. గురువారం న్యూ ఢిల్లీలోని షేపింగ్ ఫ్రేమ్ వర్క్, టెక్నాలజీ, స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్స్ అనే థీమ్ కింద ఎనర్జీ స్టోరేజ్ కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్‌లో సరస్వత్ ప్రసంగించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీలో ప్రపంచవ్యాప్తంగా నాలుగో ర్యాంక్, పవన విద్యుత్ సామర్థ్యంలో నాలుగో ర్యాంక్, సౌర విద్యుత్ సామర్థ్యంలో ఐదో స్థానంలో భారత్ ఉందన్నారు. ఎనర్జీ స్టోరేజ్ కాన్ఫరెన్స్‌లో విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులు, సాంకేతిక ఆవిష్కర్తలతో సహా ఇంధన నిల్వ రంగంలో ప్రముఖ వాటాదారుల నుంచి భాగస్వామ్యం ఉంటుందన్నారు. కాన్ఫరెన్స్ డ్రైవింగ్ ఇన్నోవేషన్, ఇంధన నిల్వల విలువ గొలుసును పటిష్టం చేయడం, రంగంలో సాంకేతిక పురోగతి గురించి చర్చిస్తుందని సరస్వత్ స్పష్టం చేశారు.