హిందూత్వంపై దాడులు చేయడమే సెక్యూలరిజమా?
Does secularism in Telangana mean attacking Hindus?
"సెక్యూలరిజం అంటే మైనారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలపై దాడులు చేయడమా.? సెక్యూలరిజం అంటే ఒకవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రాళ్లు రువ్వడమా..? పార్టీల సెక్యూలరిజం వేరు, ప్రజల మధ్య ఉన్న సెక్యూలరిజం వేరు.. నిజానికి సెక్యురిజం ఆకాంక్ష వేరు. భారతరాజ్యాంగంలో చేర్చిన సెక్యులరిజం మనకు ఎం బోధిస్తున్నది. దీని మాటున ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి.!" హిందూత్వంపై ఓక్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు చేస్తున్న విధ్వంసం కారణంగా అది మతాల మధ్య చిచ్చురేపే ఆస్కారం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. లౌకికవాదం మంటగలుస్తున్నది.
చెంగిచర్ల ఘటన
భాగ్యనగరం నడిబొడ్డున జరిగిన సంఘటన అందరిని ఆలోచింపజేస్తున్నది. మార్చి 23న చెంగిచర్ల పిట్టల బస్తీలో హిందువులు-ముస్లింల మధ్య ఘర్షణ తలెత్తింది. పిట్టల బస్తీలో మొత్తం ముస్లిం కుటుంబాలు కేవలం ఆరు మాత్రమే.. మిగిలిన ప్రజలు హిందువులే. పిట్టల బస్తీ వాసులు హొలీ సందర్భంగా వేడుకలు నిర్వహించుకున్నారు. కాముడి దహనం అనంతరం.. వారి ఆచారం ప్రకారం అమ్మవారిని ప్రతిష్టించుకుని సంబరాలు చేసుకున్నారు. ఇదే క్రమంలో ప్రార్ధనమందిరం నుండి వచ్చిన అన్యమతస్థులు సంబరాలు జరుపుకునే పిట్టల బస్తి వాసూలపై భౌతికదాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. సుమారు 300 మంది వరకు 30 కుటుంబాలపై దాడి చేశారని బాధితులు వాపోయారు. ఈ ఘటనలో ఇరువర్గాలు గాయపడ్డాయని పోలీసులు చెప్తున్నా.. వాస్తవం అందుకు భిన్నంగా ఉందని హిందూపరివార్, బీజేపీ వాదిస్తున్నది. హిందూవర్గాల ప్రజలపై అమానుషంగా దాడి చేశారని, న్యాయం చేయాల్సిన అధికారులు కూడా.. మహిళలపట్ల కనిరకం లేకుండా ప్రవర్తించారని హిందూ సంఘాలు చెప్తున్నాయి. రాళ్ళ దాడిలో ఓ మహిళ తలకి బలంగా గాయాలు కాగా.. కుట్లు వేయించుకుని చికిత్స తీసుకుంటున్నది. మరో గర్భవతి పట్ల కూడా దారుణంగా ప్రవర్తించారు. ఇక ఈ ఘటనపై హిందుత్వానికి అండగా ఉంటామన్న బీజేపీ పిట్టల బస్తి బాధితులని పరామర్శించింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇరువర్గాలపై కేసులు పెట్టామని పోలీసులు చెప్తున్నారు. హిందువులపైనే ఎక్కువ కేసులు పెట్టారని, అన్యవర్గాలపై పేరుకు మాత్రమే కేసులు నమోదు చేశారనే విమర్శకూడా ఉంది.
బైంసా సంఘటన
గతంలో నిర్మల్ జిల్లా బైంసాలో తలెత్తిన వివాదం కూడా మతాల మధ్య చిచ్చును రాజేసింది. ఆఖరికి ఆ ఘటనతో హిందువులు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిన పరిస్థితిని చూశాం. సుమారు 100 కుటుంబాలు ఇండ్లు కోల్పోయారు. ఇక్కడ కూడా రాళ్లదాడే జరిగింది. ప్రభుత్వం బాధితులకి అండగా నిలబడకపోతే ఆఖరికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ సేవా భారతి ఆధ్వర్యంలో గృహాలు కోల్పోయిన బాధితులకు నివాసయోగ్యం కల్పించారు. ఈ ఘటన ఓ మారణ హోమమే.. నివాసాలు కోల్పోయారు. ఉపాధిని కోల్పోయారు. అన్నమో రామచంద్ర అంటూ బోరున విలపించారు. ఆనాటి ప్రభుత్వం కూడా కొంతమందిపై కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంది.
సెక్యులరిజంలో బాధితులకు అండ ఎవరు ?
రాష్ట్రంలో బహిరంగంగా జరిగిన ఘటనలు ఇవి అయితే.. నష్టపోయింది మాత్రం నిస్సందేహంగా హిందువులేనని చెప్పాలి. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తితే... రాళ్లు రువ్వాడనే వారి ముందస్తు రచించిన ప్రణాళిక అని అనుమనించాల్సిన అవసరం ఉంది. ఆనాడు బైంసాలో జరిగిన దాడిలో రాళ్లేవారి ఆయుధాలు అయ్యాయి. ఈ నెలలో చెంగిచర్లలో జరిగిన ఘటనలో కూడా రాళ్లే నిలిచాయి. మరి బాధితులకు అండగా నిలవాల్సిన నేతలు ఎక్కడ పోయారు.? సెక్యులర్ పార్టీలు అని చెప్పుకుంటున్న సంస్థలు బాధితులకు ఎందుకు అండగా నిలవలేదు.? బీజేపీ మినహా.. ఏ పార్టీ కూడా బాధితులకు భరోసా కల్పించలేదు ఎందుకు.? ప్రజా ప్రభుత్వం అంటున్న నేతలు కూడా ఇంతవరకు చెంగిచర్ల ఘటనపై స్పందించింది లేదు. విపక్షపాత్రలో ఉన్న బీజేపీ మాత్రం బాధితులని పరామర్శించింది. అండగా నిలబడతాం అని చెప్పేందుకు వెళ్లి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు కూడా కేసుల పాలయ్యారు. ఈ సందర్భంలో సంజయ్ సంధించిన ప్రశ్నలు ఆలోచింపచేస్తున్నాయి. "కాంగ్రెస్ చెప్పిన మైనారిటీ డిక్లరేషన్ అంటే హిందువులపై దాడులు చేయడమేనా? మహిళలు, నిండు గర్భిణి అని కూడా చూడకుండా దాడి చేసిన వాళ్లు లౌకికవాదులా? దుండుగలను వదిలేసి, ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే లౌకికవాదమా?’" అని అన్నారు. హిందువులపై దాడి జరిగితే కాంగ్రెస్ వాళ్లురారు, కమ్యునిస్టులు రారు, బీఆర్ఎస్ వాళ్ళు రారు... మళ్ళీ మేమే వస్తాం మేమే అండగా ఉంటాం అని బండి చెపుకొచ్చారు. వాస్తవానికి ఆయన చెప్పినది ఈ విషయంలో నూటికి నూరు శాతం నిజమే. ఎందుకంటే బైంసాలో దాడులు జరిగితే నిరాశ్రయులకి అండగా నిలబడింది బీజేపీనే, ఇవాళ చెంగిచర్ల ఘటనలో అండగా నిలబడింది బీజేపీనే. మిగతా పార్టీలు ఎక్కడ పోయాయి.? ఎందుకీ బాధితులకు అండగా నిలబట్లేదు.? మేము ఉన్నాం అనే భరోసా ఎందుకివ్వడం లేదు. ఆనాడు బైంసా, ఇవాళ చెంగిచర్ల ఘనటనలని ఏ మీడియా కూడా చూపించలేదు ఒకవర్గంపై ఈ పార్టీలకి , ఈ మీడియాకి ఎందుకు ఇంత వ్యతిరేకభావం. 300 మందిపై 30కుటుంబాలు దాడి చేస్తాయా.. 30 కుటుంబాలపై 300 కుటుంబాలు దాడి చేస్తాయా.? సెక్యులరిజం అంటే.. ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి ఏ అవతారమైనా ఎత్తడమేనా.? 1976లో 42వ రాజ్యాంగం సవరణలో చెప్పిన సెక్యులరిజాన్ని నిజంగా అనుసరిస్తున్నామా.? సెక్యూలరిజం మాటున జరుగుతున్న ఈ దమనకాండకి ఎవరిని కారణ భూతులుగా చూపించాలి.?
నివారణ ఎప్పుడు.?
ఇంకా ఇలానే దాడులు కొనసాగితే ప్రజాలమధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే పరిస్థితి తప్పదు. వర్గాలవారిగా ఘర్షణలు తలెత్తినప్పుడు నిస్పక్షపాతంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మతాల మధ్య ఘర్షణలు భవిష్యత్ తరాలకు మంచిది కాదు. ప్రభుత్వాలు సెక్యులర్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా ప్రజలను సమభావనతో చూడాలి. ఓటు బ్యాంకు కోసం మెజారిటీ ప్రజల హక్కుల్ని కాలయారకుండా చూడాల్సిన బాధ్యత పార్టీలకి ఉంది. అన్ని వర్గాలకు మేము న్యాయం చేస్తాం అని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం దాడులపట్ల న్యాయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
– శరత్ చారి
జర్నలిస్ట్