నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నిర్ధరించిన ధరల కోటా ప్రకారం 8,606 మెట్రిక్ టన్నుల చక్కెరను అమెరికాకు ఎగుమతి చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) అనుమతుల నోటిఫికేషన్ ను బుధవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం 2024 అక్టోబర్ 1నుంచి 2025 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎగుమతులకు అనుమతి చెల్లుబాటు కానుంది. చక్కెర ఎగుమతులకు అనుమతించబడినా, షరతులకు లోబడే ఎగుమతులు ఉండనున్నాయి. డీజీఎఫ్ టీ ప్రకారం చక్కెర ఎగుమతులకు ధృవపత్రాన్ని ముంబైలోని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జారీ చేస్తుంది. ఇది కేవలం ఎగుమతులకు అనుమతించబడిన నాణ్యత ప్రమాణాలను పాటించిన వాటికే ఈ అనుమతులను ఇవ్వనుంది.
ఎగుమతుల కోటా నిర్దిష్ట పరిమితిలో ఉంటే తక్కువగా సుంకాలతో అనుమతి లభిస్తుంది. దానికి అదనంగా ఎగుమతులుంటే అదనంగా సుంకాలను విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చక్కెర పంట ఎగుమతులతో ఉత్తరాది ప్రాంతాలైన హరియాణా, పంజాబ్,యూపీ, ఛత్తీస్ గఢ్, బిహార్ లాంటి ప్రాంతాలలో చెరకును పండిస్తున్న రైతులకు లబ్ధి చేకూరనుంది.