దసరా ఉత్సవ కమిటిలో బయటపడ్డ విభేదాలు
Disagreements emerged in the Dussehra festival committee
నా తెలంగాణ, అదిలాబాద్: అదిలాబాద్ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు బొంపల్లి హనుమాన్లు ఏకపక్షంగా వ్యవహరించకపోవడంతో దసరా ఉత్సవ కమిటీలో విభేదాలు పొడసూపుతున్నాయి. అదిలాబాద్ పట్టణ ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ని వేదికపైకి ఆహ్వానించకపోవడం, ఆహ్వాన పత్రికల్లో పేరు ప్రచురించకపోవడాన్ని పురపాలక కౌన్సిల్ ఫోరం తప్పుబట్టింది. ఇప్పటికైనా దసరా ఉత్సవ మిటీ తమ వైఖరిని మార్చుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని మున్సిప్ కౌన్సిల్ ఫోరం జిల్లా అధ్యక్షుడు బండారి సతీష్, కౌన్సిలర్లు హెచ్చరించారు. ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలన్నారు. చైర్మన్ కు అవమాన పర్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని మండిపడ్డారు.