ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

Oct 15, 2024 - 19:35
 0
ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

నా తెలంగాణ, మెదక్: పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను త్వరగతిన పరిష్కరించేందుకు రోజువారి లక్ష్యాలను కేటాయించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  తహసీల్దార్లకు సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ధరణి దరఖాస్తులు పెండెన్సీ పై సంబంధిత తాసిల్దారులతో సమీక్షించారు.  పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల పై మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తుల ఆన్ లైన్ లో అప్ డేట్ చేసి పరిష్కరించాలన్నారు. ధరణి దరఖాస్తులను తిరస్కరించిన పక్షంలో అందుకు స్పష్టమైన కారణాలు, సంబంధిత ఆధారిత డాక్యుమెంట్లు స్పష్టంగా అప్ లోడ్ చేయాలని సూచించారు. అలా చేయడం వల్ల  ప్రజలకు ఎందుకు దరఖాస్తు తిరస్కరించారనేది అర్ధమవుతుందని  చెప్పారు. కొన్ని సమస్యలు తహసిల్దార్ స్థాయిలో, మరికొన్ని సమస్యలు రెవెన్యూ డివిజన్ అధికారిస్థాయి లో, మరికొన్ని సమస్యలు కలెక్టర్ స్థాయిలో ఉన్న దరఖాస్తులపై పక్కా ప్రణాళికతో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.