డేంజర్ రోడ్డు  దారిపొడవున ముళ్ల పొదలు

  ఇక్కట్లు పడుతున్న వాహనదారులు  ప్రయాణికులకు తప్పని తిప్పలు 

Oct 15, 2024 - 19:40
 0
డేంజర్ రోడ్డు  దారిపొడవున ముళ్ల పొదలు

నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట బ్రిడ్జికి ఆనుకొని రోడ్డు డేంజర్ గా మారింది. రోడ్డుకు ఇరువైపులా ప్రమాదం పొంచి ఉండి ప్రయాణికులను తిప్పలు పెడుతుంది. రోడ్డుకు ఒకవైపు ముళ్లపదలు, మరో వైపు రోడ్డు విస్తీర్ణం లేకపోవడంతో ఇబ్బందులు తేలేత్తుతున్నాయి. ముళ్ల పొదలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు  ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తాత్కాలిక పరిష్కారం చూపి చేతులు దులుపుకుంటున్నారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్ ఇస్మాయిల్ ఖాన్ పెట్, పటాన్​ చెరు, నారాయణఖేడ్ వెళ్లాల్సిన లారీలు ఈ ప్రధాన దారి గుండానే వెళ్తున్నాయి. ఈ మార్గంలో అనేక పరిశ్రమలు ఉండటంతో  పరిశ్రమలకు చెందిన లారీలు వస్తున్నాయి. దాంతో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెండు వైపులా కాంక్రీట్ తో రోడ్డు వేస్తే  ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వాహనదారులు కోరుతున్నారు.