స్కూటీ నడిపి సందడి చేసిన పద్మక్క 

Oct 20, 2024 - 19:18
 0
స్కూటీ నడిపి సందడి చేసిన పద్మక్క 

 నా తెలంగాణ, మెదక్: మెదక్​ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందరెడ్డి హీరో ద్విచక్ర వాహన మేళాలో టెస్ట్​ డ్రైవ్​ నిర్వహించి అందరినీ ఆశ్చర్య పరిచారు. రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం పట్టణంలోని న్యూ వాసు మోటార్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెస్ట్​ డ్రైవ్​ లో పాల్గొన్నారు. ప్రతీ వాహనంపై రూ. 10వేలు తగ్గించడాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ద్విచక్రవాహనాన్ని నడపడంలో ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బండ నరేందర్, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, తాజా మాజీ జడ్పీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,  కో కన్వీనర్లు  లింగారెడ్డి, జుబేర్ అహ్మద్,  కౌన్సిలర్లు జయరాజ్, సుంకయ్య, నాయకులు సాదిక్ అలీ, మధు, సాప. సాయిలు, మోహన్ రాథోడ్,శ్రీనివాస్, సాయ గౌడ్, బిక్షపతి రెడ్డి, ప్రభాకర్, నవీన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.