సమాజ సేవకుడు దేవరస్
వర్థంతి సందర్భంగా సేవలను కొనియాడిన కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అంటరానితనం, ప్రజాస్వామ్య విలువలకు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటంలో ముందున్న వ్యక్తి ఆర్ఎస్ ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తృతీయ సరసంఘ్ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ అని కేంద్ర బోగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కొనియాడారు. సోమవారం దేవరస్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి స్మరించుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా బాలాసాహెబ్ దేవరస్ ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర వహించారన్నారు. ఆయన జీవితంలో ఎంతో అంకితభావం, సమాజ సేవ, నాయకత్వంతో కూడుకున్న విలువలున్నాయన్నారు. ఆయన తిరుగులేని నిబద్ధత గల నాయకుడని మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.