నా తెలంగాణ, హైదరాబాద్: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలు వెలకట్టలేనివని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పింగళి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భారత్ కు జాతీయ పతాకం ఉండాలని పింగళి వెంకయ్య భావించారు. 1921లో జాతీయ పతకాన్ని రూపొందించి గాంధీకి అందించారు. అనంతరం 1947 స్వాతంత్ర్యంలో ఇదే పతాకంలో చిన్నపాటి మార్పులు చేసి జాతీయ జెండాను అంకురార్పణ చేశారు. జాతీయ పతాకంలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యతనిచ్చిన గొప్ప దేశభక్తుడుగా పింగళి వెంకయ్య కీర్తి ప్రఖ్యాతులు సంపాదించారు. స్వాతంత్ర్య సంగ్రామంలోనూ అనేక పోరాటాల్లో పింగళి పాల్గొన్నారని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆయన సేవను కొనియాడారు.