ఢిల్లీలో నీటి కొరత సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం
Delhi's water shortage has taken the government to the Supreme Court
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడిపై ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హరియాణా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ ల నుంచి నీటిని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరింది. హీట్ వేవ్ కారణంగా నీటికొరత ఏర్పడిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. డిమాండ్ పెరిగినందున నెలరోజులపాటు నీటిని అందించాలని ఆయా రాష్ట్రాలకు సూచించాలని కోరింది. కాగా ఢిల్లీలో నీటి కొరతకు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వమే కారణమని శుక్రవారం బీజేపీ నాయకురాలు బాన్సూరి స్వరాజ్ ఆందోళనకు దిగారు. జల్ బోర్డును అప్పుల పాలు చేశారని విమర్శించారు.