స్వతంత్రులు దిగ్గజాలే!
Independents are giants!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రెండు కూటముల అభ్యర్థుల గెలుపోటములు తెరమీదికి రాగా, ప్రభుత్వ ఏర్పాటు బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదనేది నిరూపితమైంది. అదే సమయంలో పలు పార్టీలు, స్వతంత్రులుగా గెలిచిన వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. 16 మంది ఎంపీ స్థానాల్లో గెలుపొందారు. అయితే స్వతంత్రులు కదా అని వారేం ప్రజల్లో పలుకుబడి లేని వారు కాదు. వారిలో కొందరు దిగ్గజ నాయకులుగానే పేరు ప్రఖ్యాతులు సాధించిన వారున్నారు. ఆ పదహారు మంది ఇరు పార్టీలలో దేనికి సై చెప్పకపోవడం విశేషం. వారు ఎవరనేది? తెలుసుకుందాం.
చంద్రశేఖర్ ఆజాద్ (ఆజాద్ సమాజ్ పార్టీ–కాన్షీరామ్) యూపీలోని నగీనా నుంచి పోటీ చేసి గెలుపొందారు. పప్పుయాదవ్ పూర్నియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు.హర్ సిమ్రత్ కౌర్ బాదల్ (శిరోమణి అకాలీదళ్)పంజాబ్ లోని బటిండా స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అసదుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం) హైదరాబాద్ ఎంపీగా గెలుపొందారు. పంజాబ్ నుంచి ఫరీద్ కోట్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా సరబ్ జిత్ సింగ్ ఖల్సా పోటీ చేసి విజయం సాధించారు. ఇందిరాగాంధీ హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన బియాంత్ సింగ్ కుమారుడు ఖల్సా కావడం విశేషం. ఖలిస్థానీ మద్ధతుదారు అమృత్ పాల్ సింగ్ జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించాడు. ఇతనిపై ఇప్పటికే దేశ ద్రోహ చట్టానికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. విచారణ కొనసాగుతోంది.మహారాష్ర్ట నుంచి విశాల్ పాటింగ్ సాంగ్లీ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇంజనీర్ రషీద్ జమ్మూకశ్మీర్ బారాముల్లా స్థానం నుంచి ఇంజనీర్ రషీద్ విజయం సాధించాడు. ఇతనిపై ఇప్పటికే ఉపా చట్టం కింద కేసు నడుస్తోంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారన్న ఆరోపణలపై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. పటేల్ ఉమేష్ భాయ్ డామన్, డయ్యూ ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. మహ్మద్ హనీఫా లడఖ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఇంతకుముందు ఈయన ఎన్ సీ (నేషన్ కాన్ఫరెన్స్) పార్టీలో కొనసాగారు. రికీ ఆండ్రూ మేఘాలయాలోని షిల్లాంగ్ నుంచి వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ నుంచి గెలుపొందారు. రిచర్డ్ వన్ లాల్ హమంగైహా మిజోరం జడ్పీఎం అభ్యర్థిగా ఎంపీ స్థానంలో గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ నలుగురు గెలుపొందారు. మిథున్ రెడ్డి, అవినాత్ రెడ్డి, తనుజ్ రాణి, గురుమూర్తి మద్దిలలు విజయం సాధించారు. అయితే ఈ పార్టీ ఇటు ఎన్డీయే, అటు ఇండి కూటమితో గానీ జతకట్టలేదు.
ఆయా పార్టీల నుంచి గెలుపొందిన పలువురు కొందరు ఎన్డీయే కూటమికి మద్దతు పలికే అవకాశం ఉండగా, మరికొందరు ఇండి కూటమికి మద్దతు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ అభ్యర్థులు ఏ కూటమికి మద్ధతు ప్రకటించకుండా గెలుపొందారు.