ఢిల్లీ కాలుష్యం ఎక్కువ అందుకే ఇక్కడికి రావడం లేదు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
నాగ్ పూర్: ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నందున ఇక్కడికి రావాలని అనిపించడం లేదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి గడ్కరీ అన్నారు. మంగళవారం నాగ్ పూర్ లోని ఓ కార్యక్రమంలో ఎంపీ గడ్కరీ మాట్లాడారు. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న కాలుష్యం ఆందోళన కలిగిస్తుందన్నారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడమే సరైన మార్గమన్నారు. ప్రస్తుతం కాస్త కాలుష్యం మెరుగుపడినా ఇప్పటికీ కలుషితంగానే ఉందన్నారు. ఎక్యూఐ 274 ఉందని గతం కంటే తగ్గిందన్నారు. నవంబర్ తో పోలిస్తే ఢిల్లీ వాసులకు కాస్త ఊరటనిచ్చే అంశమే న్నారు. కాలుష్యం వల్ల పాఠశాలలు సైతం మూసివేయాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమన్నారు. భారత్ ప్రతీయేటా రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని, ఇది ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, జీవావరణ కోణం నుంచి చూస్తే పెద్ద సవాల్ గా మారిందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించుకోవచ్చన్నారు.