మహా నిరీక్షణకు తెర సీఎంగా ఫడ్నవీస్

​  శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక

Dec 4, 2024 - 13:08
 0
మహా నిరీక్షణకు తెర సీఎంగా ఫడ్నవీస్

ముంబాయి: ఎట్టకేలకు 11 రోజుల నిరీక్షణకు తెరపడింది. మహారాష్ర్ట ముఖ్యమంత్రిగా సీఎం ఫడ్నవీస్​ ఎంపికయ్యారు. బుధవారం బీజేపీ కేంద్ర పరిశీలకులు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, విజయ్​ రూపానీలతోపాటు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేతగా బీజేపీ నేత చంద్రకాంత్​ పాటిల్​, సుధీర్​ ముంగంటివార్​ లు ఫడ్నవీస్​ పేరును ప్రతిపాదించారు. పంకజా మొండే సమర్థించారు. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. 

డిప్యూటీ సీఎం పదవికి ఏక్​నాథ్​ షిండే, అజిత్ పవార్‌ల పేర్లు ఖరారైనట్లు సమాచారం. మహాయుతి ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు గవర్నర్‌ను మధ్యాహ్నం 3 గంటలకు కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయనున్నారు. 
డిసెంబర్​ 5 గురువారం ఆజాద్​ మైదానంలో సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎట్టకేలకు మహా సీఎం పదవి పీఠముడి వీడడంలో ఇక మహారాష్ర్టలో రాజకీయ టెన్షన్​ కు తెరపడినట్లయ్యింది.