75 బీఆర్​వో ప్రాజెక్టులు ప్రారంభం

75 BRO projects started

Oct 13, 2024 - 18:09
 0
75 బీఆర్​వో ప్రాజెక్టులు ప్రారంభం
కేంద్రమంత్రి రాజ్​ నాథ్​ సింగ్​
రూ.2,236 కోట్ల ఖర్చు
22 రోడ్లు, 51 వంతెనలు
2024–25కు రూ. 6500 కోట్ల కేటాయింపు
సురక్షిత, బలమైన భారత్​ దిశగా అడుగులు
మోదీ కల సాకారానికి రక్షణ శాఖ కీలక పాత్ర
కోల్​ కతా: రక్షణ శాఖ పటిష్టానికి, సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ అన్నారు. రూ. 2,236 కోట్ల విలువైన 75 బోర్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​ ద్వారా చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో 22 రోడ్లు, 51 వంతెనలు, 11 రాష్​ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టులున్నాయి. 
 
పశ్చిమ బెంగాల్​ లోని సుక్నాలో త్రిశక్తి కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్​ నాథ్​ సింగ్​ మాట్లాడుతూ..2014 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీఆర్​ వో చేపడుతున్న ప్రాజెక్టులకు గణనీయంగా నిధులను కేటాయించామన్నారు. 2024–25కు సంబంధించి కూడా రూ. 6500 కోట్లను కేటాయించామని తెలిపారు. రక్షణ, సరిహద్దును బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతికూల వాతావరణంలో సైతం తామనుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ప్రధాని మోదీ విజన్​ 2047 వికసిత్​ భారత్​ దిశగా రక్షణ శాఖ కల సాకారంలో కీలక భూమిక పోషిస్తుందన్నారు. ప్రపంచంలోన సురక్షితమైన, బలమైన దేశంగా భారత్​ ఎదుగుతోందని కేంద్ర మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు.