వీళ్ళకు "విశ్వం" సర్వస్వం కానుంది
ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల తో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నాడు.
ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల తో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నాడు. చాలా రోజులుగా విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పేరు విశ్వం. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. డైరెక్టర్ శ్రీనువైట్లకు కూడా ఈ మూవీ చాలా కీలకం కానుంది. ఎందుకంటే చాలా కాలంగా ఆయన కూడా సక్సెస్ చూడలేదు. కాబట్టి ఈ సినిమాతో ఈ కాంబినేషన్ తప్పనిసరిగా మంచి హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఫస్ట్ స్ట్రైక్ అంటూ ఒక టీజర్ విడుదల చేశారు. విశ్వం అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో గోపీచంద్ గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లు ఇదివరకే దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక ఈ ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ ఒక గన్నుతో పెళ్లిలోకి వెళ్లి అక్కడ అందర్నీ చంపేసిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే గోపీచంద్, శ్రీను వైట్ల కు ఈ విశ్వం సర్వస్వం కానున్నది