హోర్డింగ్​ ఘటనలో 16కు పెరిగిన మృతులు

కొనసాగుతున్న సహాయక చర్యలు

May 15, 2024 - 14:17
 0
హోర్డింగ్​ ఘటనలో 16కు పెరిగిన మృతులు

ముంబై: ముంబైలో హోర్డింగ్​ కూలిన ఘటనలో సహాయక చర్యలు బుధవారం కూడా కొనసాగాయి. ఉదయం ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ బృందాలు బయటికి తీశాయి. కాగా రెస్క్యూ బృందాలకు అగ్నిపరీక్ష ఎదురవుతోంది. హోర్డింగ్​ పెట్రోల్​ పంపుపై పడడంతో ఆ ప్రాంతంలో కట్టర్​ లను ఉపయోగించలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. భూగర్భంలో పెట్రోల్​ ట్యాంకులు ఉండడంతో వాటికి నిప్పు అంటుకునే ప్రమాదం లేకపోలేదన్నారు. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. ముంబై మృతుల సంఖ్య 16కు పెరిగింది. 

హోర్డింగ్​ ఏర్పాటు చేసిన నిర్వాహకుడు భవేష్​ పై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. భవేష్​ ను అరెస్టు చేశారు. మరోవైపు అతనిపై ఇప్పటికే 23కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య, అత్యాచారాలు వంటి కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 
సోమవారం (మే 13) మధ్యాహ్నం ముంబైలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో ఘాట్‌కోపర్‌లోని ఓ పెట్రోల్‌ పంపుపై అక్రమ ప్రకటన హోర్డింగ్‌ పడింది. 100 అడుగుల ఎత్తు, 250 టన్నుల బరువున్న ఇనుప హోర్డింగ్ కింద అనేక కార్లు, ద్విచక్ర వాహనాలు, ప్రజలు సమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా గాయపడ్డారు.