బీజేపీకే ఓటేస్తానన్నందుకే దళిత బాలిక హత్య
యూపీలో ఎస్పీ నేతల ఘాతుకం
ఓటేయకుంటే చంపేస్తామని హెచ్చరికలు
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిరుపేదలు, దళితులపై ఎస్పీ రౌడీయిజం
బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ మండిపాటు
లక్నో: యూపీ మెయిన్ పురిలో బీజేపీ ఓటేయాలని పిలుపునిచ్చినందుకు దళిత బాలికను ఎస్పీ నేతలు హత్య చేశారనే ఆరోపణలపై పెద్ద యెత్తున దుమారం రేగుతోంది. మెయిన్ పురి నియోజకవర్గం కర్హాల్ లో ఎస్పీకి చెందిన దుండగులు తమ బిడ్డను పొట్టన బెట్టుకున్నారని తండ్రి, తల్లి ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
హత్య విషయాన్ని యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి తీవ్రంగా ఖండించారు. దళిత కుమార్తె ఎస్పీ సైకిల్ గుర్తుకు ఓటు వేయడానికి నిరాకరించడంతోనే హత్య చేశారని ఆరోపించారు. బాలిక బీజేపీకే ఓటు వేస్తానని చెప్పడంతో ఎస్పీకి చెందిన దుండగులు దళిత బాలికను హత్య చేశారని ఆరోపించారు. ఎస్పీ గుండాలు మానవత్వాన్ని మంటగలిపారని మండిపడ్డారు. గుండాయిజం, రౌడీరాజ్యం కారణంగానే ఎస్పీని రాష్ర్ట ప్రజలు అధికారం నుంచి దూరంగా ఉంచారన్నారు. అయినా వీరి ఆగడాలు నిరుపేదలు, దళితులపై పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వదిలేది లేదన్నారు.
తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇంటికి కొందరు వచ్చి సైకిల్ కు ఓటు వేయాలని ఆదేశించారని, తమ కూతురు అందుకు నిరాకరించిందన్నారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని వారే తమ కూతురును హత్య చేస్తామని హెచ్చరించారన్నారు. తాము ఎవ్వరికీ భయపడేది లేదని బీజేపీకే ఓటు వేస్తామని మీరేం చేస్తారో? చేయగలుగుతారో? తమ ప్రాణాలను కూడా తీసుకోండని మీడియా సాక్షిగా రోదిస్తూ చెప్పారు.