చైనా స్టీల్ బుల్లెట్లు అమెరికా ఎం–4, ఏకే–47 తుపాకులతో పూంచ్ లో ఉగ్రదాడి
సెర్చ్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు
పూంచ్: కాశ్మీర్ పూంచ్ దాడిలో భద్రతా దళాలకు విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ఆదివారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో చైనాకు చెందిన స్టీల్ బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఈ బుల్లెట్లను చైనా పాక్ ఆర్మీకి సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడి నుంచి అవి ఉగ్రవాదుల చేతుల్లోకి చేరి ఉంటాయని తెలిపారు. సాధారణంగా బుల్లెట్లను ఉక్కుతో తయారు చేస్తారు. వీటికి ధర అధికంగా ఉండడంతో చైనా స్టీల్ తో బుల్లెట్లను రూపొందించి పలు దేశాలకు సరఫరా కూడా చేస్తోంది. వీటి ధర కూడా ఉక్కు బుల్లెట్ల కంటే చాలా తక్కువ కావడంతో పలు దేశాలు ఈ బుల్లెట్లను వాడేందుకు ఇష్టపడుతున్నాయి. ఈ బుల్లెట్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సైతం చీల్చుకొని వెళ్లే సామర్థ్యం ఉండడం విశేషం.
శనివారం జరిగిన దాడిలో అమెరికాలో తయారు చేసిన ఎం-4 రైఫిళ్లు, ఏకే-47 తుపాకుల, చైనా స్టీల్ బుల్లెట్లతో మొదటిసారిగా ఉగ్రవాదులు వాయుసేన కాన్వాయ్‌పై దాడికి పాల్పడినట్లు అధికారులు స్పష్టం చేశారు.
కాగా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు 20 కిలోమీటర్ల మేర సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతానంతా చుట్టుముట్టి జల్లెడ పడుతున్నాయి.