మహా మంత్రి పదవులు ఖరారే? బీజేపీ 21, శివసేన 10, ఎన్సీపీ 12
Are-the-posts-of-Maha-Mantri-fixed-BJP-21,-Shiv-Sena-10,-NCP-12
ముంబాయి: మహా సీఎం ఫడ్నవీస్ పేరు బుధవారం ఖరారు కావడంతో మంత్రి పదవుల జాబితా కూడా బయటకు వచ్చింది. ఈ జాబితాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. జాబితా ప్రకారం 43 మంత్రులకు చోటు దక్కనుంది. గురువారం సీఎం ప్రమాణ స్వీకారం తరువాత డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంల పేర్లు ఖరారైనా ఇంకా ప్రకటించలేదు. మంత్రివర్గంలో బీజేపీ 21, షిండే శివసేన 10, ఎన్సీపీ (పవార్) 12 మంత్రిపదవులు దక్కనున్నాయి.
బీజేపీ నుంచి మంత్రి పదవులు దక్కేవారు?..
దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, చంద్రశేఖర్ బవాన్‌కులే, గిరీష్ మహాజన్, రాధాకృష్ణ విఖే పాటిల్, సుధీర్ ముంగంటివార్, రవీంద్ర చవాన్
నితీష్ రాణే, శివేంద్ర రాజే భోంస్లే జయకుమార్, గోరే, జయకుమార్ రావల్, గోపీచంద్ పదాల్కర్, అశోక్ ఉయికే, పంకజా ముండే, చంద్రకాంత్ పాటిల్, మోనికా రాజ్లే, ఉద్యాపధ్యా, స్నేహల్ దూబే.
శివసేన నుంచి..
ఏక్‌నాథ్ షిండే -ఉప ముఖ్యమంత్రి?
ఉదయ్ సామంత్, శంభురాజే దేశాయ్, దీపక్ కేసర్కర్, భారత్ గొగవాలే, దాదా భూసే, గులాబ్రావ్ పాటిల్, మంజుల గవిత్, సంజయ్ రాథోడ్,
సంజయ్ శిర్సత్.
ఎన్సీపీ నుంచి..
అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి?
ఛగన్ భుజబల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, అదితి తత్కరే, ధర్మారావు బాబా అత్రం, సంజయ్ బన్సోడే.
ప్రమాణ స్వీకారం వెంటనే కేబినెట్ సమావేశం..
గురువారం సీఎం ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే మహారాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం నిర్వహించి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశ తేదీని నిర్ణయించి డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది . ఆ తర్వాత నాగ్‌పూర్‌లో డిసెంబరు 16 నుంచి ప్రభుత్వ తొలి శీతాకాల సమావేశాలు ప్రారంభం కావచ్చని సమాచారం.