ఐడీఎఫ్ దాడులు 29మంది మృతి
29 killed in IDF attacks
రమియా స్వాధీనం దిశగా దళాల కదలికలు
యూఎన్ పై దాడులకు పాల్పడొద్దన్న అమెరికా
ఇరాన్ అణు స్థావరంపై సైబర్ అటాక్?
బ్లాక్ లిస్టులో ఇరాన్ 16 ఇంధన సంస్థలు!
బీరూట్: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు లెబనాన్ లోని రమియా, గాజాలోని అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 29 మంది మృతి చెందారని ఐడీఎఫ్ ప్రకటించింది. రమియా ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా తమ సేనలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయని పేర్కొన్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం యూఎన్ పై దాడులను అమెరికా ఖండించింది. ఐక్యరాజ్యసమితి కార్యాలయాలు, సిబ్బందిపై దాడులకు పాల్పడవద్దని ఇజ్రాయెల్ కు విజ్ఞప్తి చేసింది.
ఇంకోవైపు ఇరాన్ కీలక అణు స్థావరంపై సైబర్ అటాక్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. అమెరికా ఇరాన్ కు చెందిన 16 ఇంధన సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో ఈ సంస్థల ద్వారా ఇరాన్ నిర్వహిస్తున్న కార్యకలాపాలకు విఘాతం ఏర్పడనుంది. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది కుదుపులా పరిణమించే అవకాశం లేకపోలేదు.