సొంత విమానాల్లో గాల్లో తేలిపోతున్నారు
టాలీవుడ్ హీరోలందరూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.
టాలీవుడ్ హీరోలందరూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆ మనీతో పలు రంగాల్లో పెట్టుబడి పెట్టడం, బిజినెస్ స్టార్ట్ చేసి మరింత డబ్బు పోగెసి.. విలావసంతమైన కార్లు, ఇళ్ల కోసం ఖర్చు చేస్తుంటారు. అందులో కొంతమంది సెలబ్రిటీలు ఆ డబ్బుతో సొంతంగా విమానం కొనుగోలు చేస్తుంటారు. కాగా ఇప్పటివరకు టాలీవుడ్‌లో సొంతంగా ఫ్లైట్ కలిగున్న హీరోలేవరో ఇప్పుడు తెలుసుకుందాం..
* పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి సినిమా తర్వాత విమానం కొన్నారట.
* టాలీవుడ్‌లో డీసెంట్ హీరోగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ఓన్ ఫ్లైట్ ఉంది. ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లేందుకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారని సమాచారం.
* సినిమాలకు మించి ఎన్నో బిజినెస్‌లు నడిపిస్తోన్న అక్కినేని నాగార్జునకు ప్రైవేటు జెట్ విమానం ఉంది. ఈ ఫ్లైట్‌ను నాగ చైతన్య, అఖిల్ కూడా యూజ్ చేస్తారట.
* ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ కూడా సొంతంగా విమానాన్ని కొనుగోలు చేశారట.
* ఐకాన్ అల్లు అర్జున్ ఇప్పటికే గీతా ఆర్ట్స్, అల్లు స్టూడియోస్ తో పాటు ఆహా లాంటి వ్యాపారాలు నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా ఈ-6 సీటర్ ఫ్లైట్ కొన్నట్లు సమాచారం.
* జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య రూ. 80 కోట్లు ఖర్చు చేసి సొంతంగా ఓ ప్రైవేటు విమానాన్ని కొనుగోలు చేసాడట.
* ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా రోజుల కిందటే విమానం కొన్న విషయం తెలిసిందే. ఈ ఫ్లైట్ కాస్ట్ ఏకంగా రూ.10 కోట్లు ఉంటుందని సమాచారం.
* వీళ్లు ఈ జెట్ విమానాలను.. తమకు దగ్గరలో గల ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి ఉంచుతారు. అక్కడ ఉన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది దీని మెయింటెన్స్‌తో చూసుకుంటూ ఉంటారు. దాని కోసం ఆయా ప్రైవేటు విమానాల యజమానాలతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అంతేకాదు వేరే వాళ్లకు సైతం ఆయా విమానాశ్రయ సిబ్బంది రెంట్ బేసిస్‌లో ఈ విమానాలు ఇస్తుంటారు