బీజాపూర్​ లో ఎన్​ కౌంటర్​ నలుగురు నక్సల్స్​ మృతి

భారీగా ఆయుధాలు స్వాధీనం.. వివరాలు వెల్లడించిన డీఐజీ కశ్యప్​.. చుట్టుపక్కల ప్రాంతాల్లో అలర్ట్​ జారీ

Feb 27, 2024 - 19:24
 0
బీజాపూర్​ లో ఎన్​ కౌంటర్​ నలుగురు నక్సల్స్​ మృతి

రాయ్​ పూర్​: బీజాపూర్​ తుంగలి అటవీ ప్రాంతానికి సమీపంలో భద్రతా దళాలకు, నక్సల్స్​  కు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సల్స్​ మృతి చెందారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, సాహిత్య పుస్తకాలు లభించినట్లు డిప్యూటీ ఇన్​ స్పెక్టర్​ జనరల్​ (డీఐజీ) కమలోచన్​ కశ్యప్​ మంగళవారం మీడియాకు వివరాలందించారు. జంగ్లా పోలీస్​ స్టేషన్​ పరిధిలో జిల్లా రిజర్వ్​ గార్డులు, సెంట్రల్​ రిజర్వ్​ పోలీసు ఫోర్టు ప్రత్యేక బృందాలు కూంబింగ్​ నిర్వహిస్తుండగా తుంగలి అటవీకి సమీపంలో నక్సల్స్​, భద్రతా దళాలకు మధ్య ఉదయం 11  గంటల ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకొని అదనపు భద్రతా సిబ్బందిని పంపించామన్నారు. ఈ లోపుగా నలుగురు నక్సల్స్​ ఎన్​ కౌంటర్​ లో మృతిచెందారని పేర్కొన్నారు. నక్సల్స్​ మృతితో చుట్టుపక్కల ప్రాంతాల్లో అలజడి రేగగా అదనపు బలగాలను మోహరించి ఓ వైపు కూంబింగ్​ చర్యలను పటిష్టం చేయడంతోపాటు స్థానిక గ్రామాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నామని డీఐజీ కశ్యప్​ తెలిపారు.