తిరంగ యాత్రలో హత్య ఆరేళ్ల తర్వాత దోషులకు శిక్ష 

Convicts sentenced after six years of Thiranga Yatra murder

Jan 2, 2025 - 17:13
 0
తిరంగ యాత్రలో హత్య ఆరేళ్ల తర్వాత దోషులకు శిక్ష 

లక్నో: కాస్​ గంజ్​ తిరంగయాత్రలో హత్యకు గురైన చందన్​ గుప్తా కేసులో 28మంది నిందితులకు శిక్ష పడింది. గురువారం లక్నో ఎన్​ ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరిస్తూ శిక్షను ఖరారు చేసింది. శుక్రవారం శిక్షు ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. 2018 జనవరి 26న కాస్​ గంజ్​ లో చందన్​ గుప్తా తిరంగా యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో గుప్తా హత్యకు గురయ్యాడు. ఈ అల్లర్ల కేసులో పోలీసులు 49 మందిని అరెస్టు చేశారు. గుప్తా హత్యలో 28మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి దోషులుగా నిర్ధారించింది. కానీ ఇద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సలీం. ఈ దాడుల తరువాత కాస్​ గంజ్​ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్లు చెలరేగాయి. దోషులకు శిక్ష ఖరారు కావడం పట్ల చందన్​ గుప్తా తండ్రి సుశీల్​ గుప్తా తమకు న్యాయం చేకూరిందన్నారు. ఆలస్యమైనా భారత చట్టాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. తమ కొడుకును అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.