కూరగాయల మార్కెట్​ లో అగ్నిప్రమాదం 8 మంది మృతి

పలువురికి గాయాలు

Jan 4, 2025 - 17:53
 0
కూరగాయల మార్కెట్​ లో అగ్నిప్రమాదం 8 మంది మృతి

బీజింగ్​: చైనా ఉత్తర ప్రావిన్స్​ హెబెయ్ లిగువాంగ్​​ కూరగాయల మార్కెట్​ లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది సజీవ దహనమయ్యారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిప్రమాదం సందర్భంగా భారీగా పొగలు కమ్ముకున్నాయి. స్పందించిన స్థానికులు వెంటనే సమాచారం అందజేసినా అగ్నిమాపక శాఖాధికారులు గంట తరువాత వచ్చారు. అనంతరం మంటలు చాలాసేపటి తరువాత అదుపులోకి వచ్చాయి. అధికారుల తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్కెట్ 2011లో ప్రారంభించారు. ఈ మార్కెట్‌లో కూరగాయలతోపాటు ఎలక్ట్రానిక్స్ కూడా అమ్ముతారు. అగ్నిప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు.