సాహిత్యంలో దక్షిణ కొరియా హేన్ కాంగ్ కు నోబెల్
South Korean Han Kang won the Nobel Prize in Literature
స్టాక్ హోమ్: సాహిత్యంలో దక్షిణ కొరియా చెందిన రచయిత్రి హేన్ కాంగ్ కు నోబెల్ –2024కు ఎంపికైంది. ఈమె రాసిన ప్రముఖ నవలలో ‘ది విజిటేరియన్ బుక్ ఒకటి. గురువారం రాయల్ స్వీడీష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో నోబెల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ బహుమతిని కమిటీ చైర్మన్ అండర్స్ ఓల్సన్ ప్రకటించారు. ఈమె రచనల్లో మానవ జీవితంలోని ఎదుర్కొనే దుర్భలత్వాన్ని బహిర్గతం చేశారు. శరీరం, ఆత్మ, జీవించి ఉన్న వారు, లేని వారు లాంటి బంధాలపై కూడా ఈమె అనేక పుస్తకాలు రాశారు. సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని దక్షిణ కొరియా గెలుచుకోవడం ఇదే తొలిసారిగా నమోదైంది. చైనా కెన్ జు, కెన్యా న్గుగి వా థియోంగో, ఆస్ర్టేలియా గెరాల్డ్ ముర్నేన్, కెనడా అన్నే కార్సన్ వంటి రచయితలు పోటీలో ఉన్నా విజయం హేన్ కాంగ్ నే వరించింది.