దేశ జవాన్లపై మమత ఆగ్రహం
Mamata is angry with the soldiers of the country
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దేశ సైనికులపై నోరు పారేసుకున్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో చొరబాట్లకు బీఎస్ ఎఫ్ జవాన్లే కారణమన్నారు. మహిళలను హింసిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అశాంతి సృష్టిస్తున్నారని విమర్శించారు. దీంతో బెంగాల్ లో అశాంతి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎజెండాను సైనికులు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాంపూర్, సీతాయ్, చోప్రా సరిహద్దుల నుంచి బంగ్లాదేశీయుల చొరబాట్లకు ఆస్కారం ఉండడంతో కేంద్రం భారీగా సరిహద్దుల్లో బలగాలను మోహరించారు. ఈ చర్యను గతంలో కూడా మమత ఖండించారు. రెండుసార్లు స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే షానవాజ్ షేక్ ఇంటిపై ఈడీ, సీబీఐ సోదాలు చేసేందుకు రాగా వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. ఏకంగా రెండు నెలలపాటు ఎమ్మెల్యే పరారీలో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమాయుధాలు ఇతని ద్వారానే అందుతున్న సమాచారం ఇంటలిజెన్స్ వద్ద ఉంది. దీని ద్వారానే భారీగా పోగేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ప్రజాప్రతినిధులను రక్షించేందుకు మమత అనేకసార్లు ప్రయత్నించారు. తీరా అసలు విషయాలు బయటపడుతుండడంతో సీఎం పొంతనలేని ఆరోపణలు చేస్తూ ఏకంగా నేడు దేశ సైనికులపైనే ఆరోపణలు చేయడం పలు విమర్శలకు తావిస్తుంది.