స్టాక్​ మార్కెట్​ లో రెండో రోజు కొనసాగిన జోరు

The momentum continued for the second day in the stock market

Jan 2, 2025 - 16:30
 0
స్టాక్​ మార్కెట్​ లో రెండో రోజు కొనసాగిన జోరు

సెన్సెక్స్​ 1,436 పాయింట్లు, నిఫ్టీ 445.57 పాయింట్ల వద్ద ముగింపు

ముంబాయి: నూతన సంవత్సరం రెండో రోజు గురువారం భారత మార్కెట్ లో జోష్​ కనిపించింది. స్టాక్​ మార్కెట్​ లో బుల్​ రన్​ తో లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్​ 1,436 పాయింట్లు 1.83 శాతం పెరిగి 79,943.71 వద్ద ముగిసింది. నిఫ్టీ 445.57 పాయింట్లు 1.8 8శాతం లాభంతో 24,188.65 లాభాల వద్ద ముగిశాయి. ట్రేడింగ్​ లో 2312 షేర్లు లాభాల్లో కొనసాగగా, 108 షేర్లు స్థిరంగానే కొనసాగాయి. 1496 షేర్లలో  స్వల్ప క్షీణత నమోదైంది. నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లు నిలిచాయి. బీఎస్​ ఈ మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్ సూచీలు​ ఒక్కో శాతం పెరిగాయి.ఆటో ఇండెక్స్ 3.5 శాతం, ఐటీ ఇండెక్స్ 2 శాతం చొప్పున పెరిగాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్లు, రాబోయే త్రైమాసిక ఆదాయాల పట్ల సానుకూల, సహాయక సాంకేతిక దృక్పథం కారణంగా మార్కెట్‌లో నేటి పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది.