నికోబార్​ కు రుతుపవనాలు

మే 31న కేరళకు వివరాలు వెల్లడించిన ఐఎండీ

May 19, 2024 - 14:58
 0
నికోబార్​ కు రుతుపవనాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రుతుపవనాలు అండమాన్​ నికోబార్​ కు చేరుకున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. మే 31న కేరళకు చేరుకోనున్నట్లు వివరించింది. రుతుపవనాల ప్రభావంతో శనివారం కేరళలో భారీ వర్షాలు కురిసాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గతేడాది రుతుపవనాలు నికోబార్​ కు తొమ్మిది రోజులు ఆలస్యంగా వచ్చాయని ఐఎండీ పేర్కొంది. జూన్​ 8న కేరళకు చేరాయని తెలిపింది.
ఈసారి సాధారణ సమయం కంటే ముందే కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని పేర్కొంది. మే 28 నుంచి జన్​ 3మధ్య రుతుపవనాలు కేరళను ఖచ్చితంగా తాకుతాయని అన్నారు. 

తమిళనాడుకు 5 జూన్​, ఆంధ్రప్రదేశ్​ 11 జూన్​, కర్ణాటక 8 జూన్​, బిహార్​ 18 జూన్​, ఝార్ఖండ్​ 17 జూన్​, పశ్చిమ బెంగాల్​ 13 జూన్​, చత్తీస్​ గఢ్​ 17, గుజరాత్​ 30, మధ్యప్రదేశ్​ 21, మహారాష్ర్ట 16, గోవా 5, ఒడిశా 16, ఉత్తరప్రదేశ్​ 25, ఉత్తరాఖండ్​ 28, హిమాచల్​ ప్రదేశ్​ 22, లడ్డాక్​, జమ్మూ 29, ఢిల్లీ 27 జూన్​ లలో, పంజాబ్​ 1 జూలై, హరియాణా 3 జూలై, చండీగఢ్​  28 జూన్​, రాజస్థాన్​ 6 జూలై, తెలంగాణ 8 జూన్​ మధ్య రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ స్పష్టం చేసింది.