ఆన్ లైన్ మత విద్య ఖలీద్ ఇంటిపై ఎన్ ఐఎ దాడి
NIA attack on online religious education Khalid's house
లక్నో: యూపీ ఝాన్సీలోని ముక్రాయన ప్రాంతంలో ముఫ్తీ ఖలీద్ ఇంటిపై ఎన్ ఐఎ బృందం బుధవారం అర్థరాత్రి 2 గంటలకు దాడి చేసింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా గూమిగూడి ఎన్ ఐఎ అధికారులను అడ్డుకున్నారు. గురువారం ఉదయం ఎన్ ఐఎ బృందం స్థానిక ఎస్పీకి సమాచారం అందజేసి బలగాలను రంగంలోకి దింపి ముఫ్తీ ఖలీద్ ను తన ఇంట్లోనే ప్రశ్నిస్తుంది. సోదాలు చేపట్టింది. ఖలీద్ పై విదేశీ నిధులకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలున్నాయి. అలిగోల్ ప్రాంతంలోని సూపర్ కాలనీలోని ఆన్ లైన్ మత విద్యను ఖలీద్ అందిస్తున్నారని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈయనకు విదేశీ నిధులు సమకూరుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఆయనను ఇంట్లోనే నిర్బంధించి ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఖలీద్ ను కలిసేందుకు ఎవ్వరినీ అనుమతించడం లేదు. బయట భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖలీద్ విచారణను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అదనపు బలగాలు రంగంలోకి దిగడంతో స్థానికులు విచారణకు ఒప్పుకున్నారు. కాగా ఈ ఆరోపణల్లో ఖలీద్ భార్య హస్తం కూడా ఉందని ఎన్ ఐఎ ఆరోపిస్తుంది.