సీతమ్మకు అతిపెద్ద దేవాలయ నిర్మాణం ఆర్టికల్​ 370 రద్దుతో రక్తపుటేరులు పారతాయా?

హిందువులను భయపెడతారా? కర్పూరీనీ గౌరవించుకోరా? పీవోకేను స్వాధీనం పక్కా ఎవ్వరికీ భయపడబోం బిహార్​ అభివృద్ధికి రూ.11లక్షల 33వేల కోట్లు కూటమిలో ఎవ్వరికీ వారే ప్రధానులు మధుబని, సీతామర్హి సభలో కేంద్రమంత్రి అమిత్​ షా

May 16, 2024 - 17:11
 0
సీతమ్మకు అతిపెద్ద దేవాలయ నిర్మాణం ఆర్టికల్​ 370 రద్దుతో రక్తపుటేరులు పారతాయా?

పాట్నా: సీతామర్హిలో సీతమ్మవారికి అతిపెద్ద దేవాలయాన్ని బీజేపీ నిర్మిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. ఆర్టికల్​ 370 రద్దుతో బిహార్​ ప్రజలకు ఏం సంబంధమని ఖర్గే ప్రకటించడంపై మండిపడ్డారు. రక్తపుటేరులు ప్రవహిస్తాయని దేశ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తారా? అని రాహుల్​ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను భయపెట్టే విధానాలకు పాల్పడతారా? అని మండిపడ్డారు. గురువారం మంత్రి అమిత్​ షా మధుబని, సీతామర్హిలో జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆర్జేడీ, కాంగ్రెస్​ పై విమర్శల బాణాలు విసిరారు. 

పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కర్పూరీ ఠాకూర్​ ను గౌరవించుకోలేని పార్టీ, నాయకులు ఉండడం దురదృష్టకరమని లాలూను విమర్శించారు. చివరకు ఆయనకు గౌరవాన్ని బీజేపీ ఇవ్వాల్సి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 

భారత్​ నుంచి ఒక్క గులకరాయిని కూడా తీసుకుపోతే సహించేది లేదని అమిత్​ షా స్పష్టం చేశారు. పీవోకేను ఖచ్చితంగా స్వాధీనం చేసుకొని తీరుతామన్నారు. ఎవ్వరికీ భయపడబోమని స్పష్టం చేశారు.

గోవులను హత్య చేసిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామన్నారు. ఇష్టారీతిన గో హత్యపై మండిపడ్డారు. 

కాంగ్రెస్​, ఆర్జేడీలు బిహార్​ కు ఏం చేశాయని ప్రశ్నించారు. మోదీ నేతృత్వంలో పదేళ్లలో రూ. 11 లక్షల 33 వేల కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

ఇండీ కూటమిలో అందరూ ప్రధానులే అన్నారు. ఎవరికి వారే ప్రధానిగా చెప్పుకుంటూ పగటి కలలు కంటున్నారని పేర్కొన్నారు. ఎవరు ప్రధాని అభ్యర్థి అని ప్రకటించే కనీస ధైర్యం కూడా వారిలో లేదని అమిత్​ షా విమర్శించారు.