విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన
Awareness of cleanliness among students
నా తెలంగాణ, నిర్మల్: సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహనా సదస్సు గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ శ్రీ గ్రీన్ వర్క్స్ సంస్థ కో ఆర్డినేటర్ కిఫాయతుల్లా ఖాన్ విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పారిశుధ్యంపై ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ అజరుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.