చివరిరోజు గడ్కరీ నామినేషన్
కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ బుధవారం నాగ్పూర్ స్థానానికి ఎంపీగా తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పలువురు దిగ్గజ నేతలు గడ్కరీ వెంట నామినేషన్లో పాల్గొని శక్తి ప్రదర్శన నిర్వహించారు.
నాగ్పూర్: కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ బుధవారం నాగ్పూర్ స్థానానికి ఎంపీగా తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పలువురు దిగ్గజ నేతలు గడ్కరీ వెంట నామినేషన్లో పాల్గొని శక్తి ప్రదర్శన నిర్వహించారు. సీఎం ఏకానాథ్షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. గడ్కరీ నామినేషన్ కోసం వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో నాగ్పూర్ చౌక్ ప్రాంతం పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నామినేషన్ను సమర్పించారు. ఈ ప్రక్రియలో గడ్కరీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈసారి నితీన్ గడ్కరీ ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తారని ఆయన కోడలు ఆశాభావం వ్యక్తం చేశారు. గడ్కరీకి పోటీగా ఎవ్వరూ చేరువులో లేరని అన్నారు. మరోవైపు బుధవారంతో నామినేషన్ల గడువు సమాప్తం కానుంది.