సీఎం పదవి తొలగింపు పిటిషన్​ సుప్రీం కోర్టు తిరస్కరణ

ఎల్జీ నిర్ణయంలో జోక్యం చేసుకోమన్న సుప్రీం

May 13, 2024 - 14:27
 0
సీఎం పదవి తొలగింపు పిటిషన్​ సుప్రీం కోర్టు తిరస్కరణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సీఎం కేజ్రీవల్​ ను పదవి నుంచి తొలగించాలనే పిటిషన్​ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్​ ను సోమవారం సుప్రీం విచారించింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్​ ఖన్నా మాట్లాడుతూ.. హైకోర్టు నిర్ణయంతో తాము జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఎల్జీ (లెఫ్టినెంట్​ గవర్నర్​) నిర్ణయంపై కూడా తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్​ అరెస్టు తరువాత ఆయన పదవిని విడిచిపెట్టలేదు. జైలు నుంచే పాలన కూడా కొనసాగించారు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. కేజ్రీవాల్​ రాజీనామా చేయాలనే డిమాండ్లు క్రమేణా ఉపందుకున్నాయి.