28న రూ. 4800 కోట్ల పనుల ప్రారంభం
ప్రారంభించినున్న ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గుజరాత్ లో రూ. 4800 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్28న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు శనివారం పీఎంవో కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అమ్రేలి, జామ్‌నగర్, మోర్బి, దేవభూమి ద్వారక, జునాగఢ్, పోర్ బందర్, కచ్, బొటాడ్ జిల్లాల్లో దాదాపు 1600 అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. నీటి సరఫరా శాఖకు చెందిన రూ.705 కోట్ల విలువైన ప్రాజెక్టులు, అమ్రేలి జిల్లాలోని గగాడియో నదిపై రూ.35 కోట్లతో నిర్మించిన భరతమాత సరోవర్ ప్రారంభోత్సవం, పిట్ రీఛార్జ్, బోర్ రీఛార్జ్, వెల్ రీఛార్జ్ 1000 ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. రూ. 2800 కోట్ల కంటే ఎక్కువ విలువైన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టులు, రైల్వే శాఖ ఆధ్వర్యంలో రూ.1094 కోట్లతో భుజ్-నాలియా గేజ్ కన్వర్షన్ ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టులకు రూ.112 కోట్లు, పూర్తయిన ప్రాజెక్టులకు రూ.644 కోట్లు కలిపి రూ.705 కోట్ల విలువైన నీటి సరఫరా శాఖ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.