బలూచ్ లో 542 పాఠశాలలు మూసివేత
542 schools closed in Baloch
ఆర్థిక సంక్షోభమే కారణమని ఉపాధ్యాయుల ఆరోపణ
మొత్తం 3,694 పాఠశాలల మూసివేత
12 లక్షలమంది పిల్లల భవిష్యత్ అగమ్యగోచరం
ఇస్లామాబాద్: పాక్ లోని బెలూచిస్తాన్ లో 542 పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. పాఠశాలల మూతకు ఆర్థిక సంక్షోభమే కారణమని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఎంతోమంది పిల్లల విద్యావకాశాలు గందరగోళంలో పడ్డాయన్నారు. ఈ పాఠశాలల నిర్వహణకు, బోధనకు 16వేల మంది ఉపాధ్యాయులు అవసరం అవడంతో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బలూచ్ ప్రావిన్స్ లో ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన, నిరసన, ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాక్ లో ఇప్పటివరకూ మూతపడిన పాఠశాలల సంఖ్య 3,694కు చేరింది. అత్యధికంగా పిషిన్ లో 254 పాఠశాలలు మూతపడగా, డేరాబుగ్తీలో 13 పాఠశాలలు మూసివేసింది. పాక్ ప్రభుత్వం చర్యల వల్ల 12 లక్షల మంది పిల్లల భవితవ్యం గందరగోళంలో పడింది.